కరీంనగర్ టౌన్,వెలుగు: కేడీసీసీబీ ద్వారా ఆందించే రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్పాల్గొన్నారు.
కేడీసీసీబీ ద్వారా ఆయిల్పామ్సాగు కోసం, అంతర్పంటల కోసం లోన్లు ఇస్తున్నామన్నారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం జయప్రకాశ్, కేడీసీసీబీ సీఈఒ సత్యనారాయణ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల ఎల్డీఎంలు ఆంజనేయులు, వెంకట్ రెడ్డి, కరీంనగర్, రాజన్నసిరిసిల్లా జిల్లాల డీఏవోలు శ్రీధర్, వి.భాస్కర్ పాల్గొన్నారు.