- కలెక్టర్ పమేలా సత్పతి.
గంగాధర/రామడుగు, వెలుగు: రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం వెదిర రైతువేదిక, గంగాధర మండలం గర్శకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2,300 అందించనున్నట్లు పేర్కొన్నారు. వారివెంట అడిషనల్ కలెక్టర్లక్ష్మీకిరణ్, డీఆర్డీవో శ్రీధర్, గోపాల్‌రావుపేట, గంగాధర ఏఎంసీల చైర్‌పర్సన్లు బి.తిరుమల, జాగిరపు రజిత, కురిక్యాల పీఏసీఎస్ చైర్మన్ తిర్మల్‌రావు పాల్గొన్నారు.
వడ్లు కొన్న వారంలోపు డబ్బులు జమ
చొప్పదండి, వెలుగు: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొన్న వారం లోపే రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి మండలంలోని కాట్నపల్లి, గుమ్లాపూర్ గ్రామాల్లోని గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు సెంటర్‌ను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాల కల్పనతోపాటు కోతలు లేకుండా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుర్రం నీరజ, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, కౌన్సిలర్ అశోక్, గంగయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సివిల్ సప్లై డీఎం సురేశ్, డీఆర్డీవో సునీత, ఏపీఎం నర్మదా, కమిటీ మెంబర్లు, లీడర్లు
పాల్గొన్నారు.