ఎంపీ ఎలక్షన్లకు రెడీ కావాలి : పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు రెడీ కావాలని  కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం  కలెక్టరేట్ లో  రిటర్నింగ్ ఆఫీసర్లతో  సమీక్ష నిర్వహించారు.  కరీంనగర్ పార్లమెంట్​   పరిధిలోని  కరీంనగర్, చొప్పదండి,మానకొండూర్, హుజురాబాద్ హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల  అసెంబ్లీ నియోజకవర్గాల  అధికారుల నియామకంతో పాటు   మౌలిక వసతుల గురించి చర్చించారు.  

ఎన్నికల నిర్వహణకు మ్యాన్ పవర్ మెనేజ్ మెంట్ సక్రమంగా  ఉండేలా  చూడాలన్నారు.  అన్ని రాజకీయ పార్టీల  ప్రతినిధులతో సమీక్షించి 2 కిలో మీటర్ల కన్నా  ఎక్కువ దూరంలో పొలింగ్ కేంద్రాలున్నా, 13వందలపైగా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలున్నా  ఆయా ప్రదేశాల్లో  కొత్త  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు  చేసేందుకు ప్రతిపాదనలను  పంపించాలని  ఆదేశించారు.  సమావేశంలో  అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్,లక్ష్మీ కిరణ్, ఆర్డీఓలు   సింహరాజు మధుసూధన్,కె. మహేశ్వర్,  బెన్ సలాన్, ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.