కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల కలెక్టర్పమేలా సత్పతి సూచించారు. అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులు నమోదు చేసి నమోదులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శనివారం 37వ డివిజన్ రామ్ నగర్, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెంటర్ల వద్ద వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దరఖాస్తు నమోదులో ప్రజలకు అధికారులు, సిబ్బంది సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్స్వరూపరాణి హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సర్పంచ్ సంపత్ పాల్గొన్నారు.
అప్లికేషన్లు అమ్మితే చర్యలు
జమ్మికుంట: ప్రజాపాలన అప్లికేషన్లు అమ్మితే చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్దేశాయ్ సిబ్బందిని హెచ్చరించారు. శనివారం జమ్మికుంటలోని బాయ్స్ స్కూల్‌లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వరంగల్ ఆర్డీఎంఏ సయ్యద్ మసూద్ సైతం ప్రజాపాలనను పరిశీలించారు.
ముత్తారం: ముత్తారం మండలం హరిపురం, మైదంబండ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభకు ఆర్డీవో హనుమాన్ నాయక్ హాజరయ్యారు. ఆయన వెంట మండల స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ రెడ్డి , మిషన్ భగీరత ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీవో వేణుమాధవ్, సర్పంచ్ సంపత్ రావు తదితరులు ఉన్నారు.