మగవాళ్లు వాసెక్టమీ చేయించుకోవాలి : కలెక్టర్​పమేలా సత్పతి

  • కలెక్టర్ ​పమేలా సత్పతి 

యాదాద్రి, వెలుగు : మగవాళ్లు వాసెక్టమీ చేయించుకోవాలని కలెక్టర్​పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాభా నియంత్రణకు కృషి చేసిన  అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి మాట్లాడారు. కుటుంబ నియంత్రణలో మగవాళ్ల భాగస్వామ్యం ఉండాలని, ఈ మేరకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మహిళలు ఆపరేషన్ ​చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. కాన్పు, కాన్పుకు మధ్య ఎడం లేకపోడంతో పాటు మగ సంతానం కావాలని ఎదురుచూడడం వల్ల జనాభా పెరుగుతోందన్నారు.

ఆడపిల్లలపై వివక్ష చూపకుండా లింగ సమానత్వం పాటించాలని సూచించారు. జనాభా పెరుగుదల వలన కలిగే అనర్థాలు, సామాజిక అసమానతలు, ఆర్థిక సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.  ఈ మీటింగ్​లో డీఎంహెచ్​వో మల్లికార్జున్​రావు, డాక్టర్లు​ యశోద, పరిపూర్ణచారి, పాపారావు, వినోద్​ ఉన్నారు.