కరీంనగర్ టౌన్, వెలుగు : ఈనెల 15న కరీంనగర్ లో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రను సక్సెస్ చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి భక్తులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కళాభారతి ఎదుట బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుడి సైకతా శిల్పాన్ని కలెక్టర్ పమేలాసత్పతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం భక్తుడు సాలెబేగ భక్తిభావం ఆదర్శనీయమన్నారు.
జగన్నాథుడి బోధనలను అనుసరించి ప్రజలు సన్మార్గంలో పయనించాలని సూచించారు. సైకతా శిల్పాన్ని భాగ్యనగర్ కు చెందిన శిల్పి రేవెల్లి శంకర్ రూపొందించారు. రథయాత్ర నిర్వాహకుడు నరహరి ప్రభూజీ, మాజీ మేయర్ రవీందర్ సింగ్, రథయాత్ర కమిటీ మెంబర్ డా.రాజ భాస్కర్ రెడ్డి, చైర్మన్ కన్నకృష్ణ, కోచైర్మన్లు తుమ్మల రమేశ్ రెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పిల్లల రక్షణకు హెల్ప్ డెస్క్
బాలల సంరక్షణకు బాలరక్షణ భవన్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పిల్లలు తప్పిపోయినా, లైంగిక వేధింపులు, అనాథలు, భిక్షాటన, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న బాలకార్మికుల వివరాలు తెలిస్తే 9490881098కు సమాచారమివ్వాలన్నారు.
మహిళలు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి
కొత్తపల్లి : మహిళలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, వారు హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచించారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ హైస్కూల్‌లో శుక్రవారం సభను ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహిళల సమస్యల పరిష్కారానికే అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభకు శ్రీకారం చుట్టామన్నారు.