కరీంనగర్​ అభివృద్ధికి కృషి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, కరీంనగర్ క్రైం, వెలుగు: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే లక్ష్యమని  కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో ఎంపీ  బండి సంజయ్ కుమార్, మేయర్​సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​ విజయతో కలిసి జెండా ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా ప్రగతిని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

అనంతరం ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల విన్యాసాలు అలరించాయి. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్ పాల్గొన్నారు. పోలీస్ ​కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీపీ అభిషేక్​మహంతి, ఏడీసీపీ రాజు జెండా ఎగురేశారు.