కరీంనగర్ జిల్లాలో పనిచేసే పిల్లలను బడిలో చేర్చాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లాలో పనిచేసే పిల్లలను బడిలో చేర్చాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్/గంగాధర, వెలుగు: బాలలను పని నుంచి విముక్తి కల్పించి బడిలో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. మంగళవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ స్మైల్‌‌‌‌‌‌‌‌పై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మాట్లాడుతూ... ఆపరేషన్ స్మైల్‌‌‌‌‌‌‌‌లో భాగంగా పని ప్రదేశాలలో బాలబాలికలను గుర్తించి వారికి పని నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఈ విషయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, పోలీసు, కార్మిక శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి మాట్లాడుతూ రేపటి తరం బాగుండాలంటే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్నారు.

  అనంతరం ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన దేవీ సంస్థాన్ ఎన్జీవో ద్వారా గంగాధర మండలంలోని 8  గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్లకు 45రోజుల పాటు కోచింగ్ సహా స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మాథ్స్,తెలుగు,ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో బేస్ లైన్ టెస్ట్ నిర్వహిస్తారని చెప్పారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్, ఎన్జీవో ఆర్గనైజర్ సునీతగాంధీ, డీఈవో జనార్ధన్‌‌‌‌‌‌‌‌రావు, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.