స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి :  కలెక్టర్ పమేలా సత్పతి

స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి :  కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జీపీ ఎన్నికల విధుల నిర్వహణపై ఆర్‌‌వోలు, ఏఆర్‌‌వోల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని, ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పార్టీ గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు, ఎన్నికల నియమావళి తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు దేవి శ్రీనివాస్, టి.సంపత్, ఆర్.రవీందర్, పరశురాం శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.  అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌ దేశాయ్, డీపీవో పవన్ కుమార్, తదితరులు  పాల్గొన్నారు.

ఎలక్షన్ల  అబ్జర్వర్ల నియామకం

కరీంనగర్, మెదక్, -నిజామాబాద్,-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్‌‌‌‌, టీచర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ పరిశీలకులను నియమించిందని రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే,  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ (సెల్ నెంబర్ 93984 16403 ), టీచర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు బెన్‌‌‌‌హర్ మహేశ్‌‌‌‌దత్ ఎక్కా 7993744287) లో సంప్రదించాలన్నారు.

రూల్స్‌‌‌‌కు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి 

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  ఎన్నికల కమిషన్‌‌‌‌ రూల్స్‌‌‌‌కు అనుగుణంగా ఆర్‌‌‌‌‌‌‌‌వోలు, ఏఆర్‌‌‌‌‌‌‌‌వోలు పనిచేయాలని మాస్టర్ ట్రైనర్లు సూచించారు. గురువారం స్థానిక సంస్థల ఎన్నికల విధుల నిర్వహణపై రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌వోలు, ఏఆర్‌‌‌‌‌‌‌‌వోలకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు మాట్లాడుతూ, ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు.