గ్రీవెన్స్ అప్లికేషన్లు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలాసత్పతి

గ్రీవెన్స్ అప్లికేషన్లు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి  అన్నారు.  సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన  గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజల నుంచి 169 అప్లికేషన్లు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్ష్మీకిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయి, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహేశ్వర్ పాల్గొన్నారు.

 సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్​ ఝా అన్నారు. సోమవారం ప్రజావాణికి 137 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.  ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను జిల్లా ఆఫీసర్లు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. 

ప్రజలకు చేరువయ్యేందుకే గ్రీవెన్స్ డే: ఎస్పీ 

ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే  గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బి.గీటే తెలిపారు. సోమవారం ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు.

వారు ఇచ్చే ఫిర్యాదులపై స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం చేయాలన్నారు. జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ లతతో కలసి 32 ఫిర్యాదులు స్వీకరించారు.