రెండో రోజు ఎమ్మెల్సీ స్థానాలకు 3 నామినేషన్లు : కలెక్టర్ పమేలా సత్పతి

రెండో రోజు ఎమ్మెల్సీ స్థానాలకు 3 నామినేషన్లు : కలెక్టర్  పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్/నల్గొండ, వెలుగు: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్  ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మంగళవారం రెండో రోజు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్  పమేలా సత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానానికి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి రాజు, టీచర్​ ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాలకు చెందిన ఇన్నారెడ్డి తిరుమల్ రెడ్డి నామినేషన్  వేశారు. మొదటి రోజు ఆరుగురు 13 నామినేషన్లు  సమర్పించగా, రెండో రోజు ముగ్గురు 3 నామినేషన్లు వేశారు. గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ కోసం 10 సెట్లు, టీచర్​  ఎమ్మెల్సీ  కోసం 6 సెట్ల నామినేషన్లతో కలిపి ఇప్పటి వరకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి.

నల్గొండలో రెండో రోజు నిల్.. 

వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్  ఎమ్మెల్సీ స్థానానికి రెండవ రోజు నామినేషన్లు ధాఖలు కాలేదని కలెక్టర్  ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం నుంచి నామినేషన్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.