కరీంనగర్ టౌన్, వెలుగు: చదువుకు వయస్సుతో పనిలేదని, ప్రతీ ఇంట్లో ఓ ఇన్నోవేటర్ తయారు కావాలని కలెక్టర్ పమేలాసత్పతి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆవిష్కరణలకు కరీంనగర్ జిల్లా వేదికగా నిలవాలని సూచించారు. విద్యాశాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు స్కూళ్లతో పాటు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందని, వాటికి సంబంధించిన 2 నిమిషాల వీడియో, 4 ఫొటోలు, 100 పదాల్లో రాసి, ఆగస్టు 5లోపు వాట్సప్ నంబర్ 9100678543 కు పంపించాలని సూచించారు. సమావేశంలో డీఈవో జనార్దన్ రావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, డీపీవో రవీందర్, డీఆర్డీవో శ్రీధర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.