కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రజావాణిలో స్వీకరించే దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో 223 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి, ప్రజాదర్బార్ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. జిల్లాలో 2,3 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం ఇన్ స్పైర్ మానక్ అవార్డుల పోస్టర్ ను విడుదల చేశారు.
రాజన్న సిరిసిల్ల: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 101 దరఖాస్తులు వచ్చాయన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేశ్, రాజేశ్వర్, ఆఫీసర్లు పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్: జగిత్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ రాంబాబు వినతులు స్వీకరించారు. కోరుట్ల పట్టణం ఐలాపూర్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని 31వ వార్డు కౌన్సిలర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.