ఫ్లై ఓవర్ల పనులు స్పీడప్​ చేయాలి

వికారాబాద్, వెలుగు: జిల్లాలో ఫ్లై ఓవర్ల పనులు స్పీడప్​ చేసి, మూడు నెలల్లో పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరి చందన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణాలపై కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్​అండ్​బీ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పనుల్లో నాణ్యతను పాటించాలని, ఎప్పటికప్పుడు వివరాల నివేదికలు ఇవ్వాలని చెప్పారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని సూచించారు.

కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిపై వివరాల ఆరా తీశారు. అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ 96 కోట్లతో కడుతున్న ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్​చార్జి అడిషనల్​ కలెక్టర్ సుధీర్, రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఈ వసంత నాయక్, ఇన్​చార్జి ఈఈ శ్రీధర్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.