
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్‌ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఆఫీస్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టే మొదటి కార్యక్రమం ప్రజాపాలన అని అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనిచేయాలన్నారు.
మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు అర్హులైనవారు అప్లై చేసుకోవచ్చన్నారు. అప్లికేషన్‌తో ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్ కార్డును జతపరచాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమంపై ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ బుధవారం సంగారెడ్డిలో నిర్వహించే సమావేశానికి అధికారులు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఓ నాగరాజమ్మ, పీడీ డీఆర్డీఏ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, జడ్పీ సీఈఓ రమేశ్, ఆర్డీవోలు రమేశ్, బన్సీలాల్, బెన్ శాలెం పాల్గొన్నారు.
మెదక్‌లో..
మెదక్ టౌన్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు జిల్లాలోని ప్రతి పంచాయతీ, మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ప్రతి మండలం పరిధిలో తహసీల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల చొప్పున పర్యటించి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ప్రజాపాలన సభల్లో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.
నారాయణ ఖేడ్‌లో..
నారాయణ్ ఖేడ్: ప్రజా పాలనను విజయవంతం చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం జూకల్ శివారులోని ఆడిటోరియంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభిస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రజలు ఈనెల 28 నుంచి వివిధ రకాల పథకాలకు అప్లై చేసుకోవచ్చన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకట్రెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్గోపు మల్లారెడ్డి, డాక్టర్ రాజేశ్, నాయకులు రమేశ్ చౌహాన్, కౌన్సిలర్లు వివేకానంద్, సద్దాం, హన్మాండ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.