సిద్దిపేట రూరల్, వెలుగు : ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఆఫీస్లో సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక ఎన్నికల బృందాల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధులను అధికారులందరు కలిసి నిర్వహించాలని సూచించారు.
నిఘాబృందాలు అన్ని మండలాలను కవర్ చేయాలని, లిక్కర్, ఉచిత పంపిణీలు జరగకుండా చూడాలన్నారు. సీపీ శ్వేత మాట్లాడుతూ.. అన్ని నిఘా బృందాల పనితీరును కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, హుస్నాబాద్, గజ్వేల్ రిటర్నింగ్ అధికారులు బెన్ శాలెం, బన్సీలాల్, సిద్దిపేట అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.