
సిద్దిపేట, వెలుగు: ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం హాస్పిటల్పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులతో మాట్లాడారు. హాస్పిటల్లో బెడ్స్, ఫర్నీచర్, మార్టిన్స్, కర్టేన్స్ తో పాటు ప్రతి డిపార్ట్మెంట్లో అవసరమైన అన్ని పరికరాలని సమకూర్చాలని సూచించారు.
ఎలక్ట్రిసిటీ కలెక్షన్, తాగునీటి వసతి సౌకర్యాలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ లోపల, బయట ఎలాంటి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయాలన్నారు. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి రూం కి నంబర్లు, నేమ్ ప్లేట్లు అమర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ డైరెక్టర్ విమలాథామస్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీఎం అండ్ హెచ్ఓ కాశీనాథ్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఈ రాజేందర్ కుమార్, ఎస్ఈ సురేందర్ రెడ్డి, డీఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.