
- సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట, వెలుగు : మెదక్–ఎల్కతుర్తి ఫోర్ లేన్ నిర్మాణంలో కోల్పోతున్న నిర్మాణాలు వివరాలు సేకరించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై గురువారం కలెక్టరేట్లో ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్–ఎల్కతుర్తి రహదారి విస్తరణలో ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. త్వరగా వివరాలు సేకరించి అందజేయాలని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ రాము, నేషనల్ హైవే ఈఈ కరీంనగర్ మనోహర్, సిద్దిపేట బాలమకృష్ణ తదితరులు పాల్గొన్నారు.