కాశీబుగ్గ, వెలుగు : 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఆదివారం వరంగల్ సిటీలోని దేశాయిపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య సెంటర్లో పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమానికి కలెక్టర్ ప్రావీణ్య హాజరై చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 456 బూత్‌లను ఏర్పాటు చేసనట్టు తెలిపారు.
హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించిన వాటి పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, 100 శాతం పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటరమణ, డాక్టర్లు ప్రకాశ్, గోపాలరావు, భారత్ కుమార్ ఉన్నారు.
మహబూబాబాద్ అర్భన్ : జిల్లాలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆయనతోపాట వైద్య ఆరోగ్యశాఖ అధికారి అంబరీష్ , ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయకుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఉన్నారు.
కమలాపూర్ : మండలంలో ఆదివారం 4000 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు వైద్యులు నాగరాజు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ముఖ్యఅతిథిగా జడ్పీటీసీ లాండిగె కల్యాణి పాల్గొన్నారు.
నల్లబెల్లి : నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో పోలియో చుక్కలను నల్లబెల్లి. మేడిపల్లి డాక్టర్ శశికుమార్, దుగ్గొండి డాక్టర్ కిరణ్ రాజ్ వేశారు.
జనగామ అర్బన్ : పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని జనగామ అడిషనల్ కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున అన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రహమాన్ పాల్గొన్నారు.