హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ప్రజావాణిలో అందజేసిన అర్జీలపై వెంటనే స్పందించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి ఆమె దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలతో మొత్తం 71 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత అధికారులకు పంపించి, వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో గణేశ్, ఆర్డీవో నారాయణ, డీఆర్డీవో మేన శ్రీను, జడ్పీ సీఈవో విద్యాలత తదితరులు పాల్గొన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తకు సన్మానం..
శాయంపేట : స్వయం సహాయక సంఘ సభ్యురాలుగా ఉంటూ స్వయం శక్తితో ఎదిగి ఏటా రూ.1.20 కోట్ల టర్నోవర్తో మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగిన దాసరి కల్పనను కలెక్టర్ ప్రావీణ్య సన్మానించారు. ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రులతో ముఖాముఖిలో పాల్గొని జాతీయ స్థాయిలో సక్సెస్స్టోరీని చెప్రారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన ఆమె స్వయం సహాయక సంఘంలో చేరి అంచలంచెలుగా ఎదిగి విధానాన్ని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్సూచించారు.