క్రీడల్లో 675 మంది విద్యార్థులకు శిక్షణ : కలెక్టర్​ ప్రియాంక అల

క్రీడల్లో 675 మంది విద్యార్థులకు శిక్షణ : కలెక్టర్​ ప్రియాంక అల

పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 15 వేసవి శిక్షణ కేంద్రాల్లో నెల రోజులు పాటు 675 మం ది విద్యార్థులకు పలు క్రీడల్లో శిక్షణ ఇచ్చామని కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఆర్చరీలో శిక్షణ పొందిన విద్యార్థుల శిక్షణ ముగింపు సందర్భంగా ఆదివారం స్థానిక శ్రీనివాస కాలనీలోని మినీ స్టేడియంలో సర్టిఫికెట్లు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఆర్చరీ, బాక్సింగ్, కరాటే, తైక్వాండో, రెజ్లింగ్ తదితర క్రీడల్లో విద్యార్థులు శిక్షణ పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల, మైనారిటీ అధికారులు పరంధామరెడ్డి, సంజీవ రావు సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్, తిరుమలరావు, లక్ష్మయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, శిక్షకులు పాల్గొన్నారు.