పాల్వంచ, వెలుగు : పాల్వంచ కేటీపీఎస్ లోని డీఏవీ స్కూల్లోని టెన్త్ ఎగ్జామ్ సెంటర్ను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రాల్లో ఎటువంటి పొరపాట్లు జరిగినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
సెంటర్ల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. అన్ని సౌకర్యాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట కొత్తగూడెం ఆర్డీవో మధు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి, సానిటరీ ఇన్స్పెక్టర్లక్ష్మణ్ రావు, తహసీల్దార్ జీ.వివేక్ ఉన్నారు.