ఇంకుడు గుంతల నిర్మాణాల్లో జాప్యంపై కలెక్టర్​ అసహనం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంకుడు గుంతల నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్​ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆమె మాట్లాడారు. జిల్లాలో 350 ఇంకుడు గుంతలు మంజూరు చేసినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేయడంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.

పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు  చేపట్టాలని ఆదేశించారు. పర్మిషన్​ లేకుండా బోర్లు వేస్తున్న వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి వాటర్​ ట్యాంక్​లను శుభ్రం చేయించాలని చెప్పారు. ఈ ప్రోగ్రాలో డీఆర్డీవో విద్యాచందన, మిషన్​ భగీరథ ఈఈ తిరుమలేశ్, డీఈలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.