పెండింగ్​ ఫైళ్లను క్లియర్​ చేయాలి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఎన్నికల కోడ్​ ముగిసినందున పరిపాలనలో వేగం పెంచాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఆఫీసర్లను ఆదేశించారు. ఈ ఆఫీస్​ విధానాన్ని అమలు చేయాలన్నారు. కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

పెండింగ్​లో ఉన్న ఫైళ్లను త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఆఫీస్​ ద్వారా ళ్లు భద్రంగా ఉంటాయన్నారు. కోర్టు కేసులకు సంబంధించి తక్షణమే కౌంటర్​ దాఖలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​ పి.రాంబాబు, డీఆర్​ఓ రవీంద్రనాథ్, ఏడో గన్యాతో పాటు అన్ని విభాగాల అధికారులు  పాల్గొన్నారు.