ప్రతి ఇంటికీ తాగునీరందేలా చర్యలు : కలెక్టర్​ ప్రియాంక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. బుధవారం పలు శాఖల అధికారులతో కలెక్టరేట్​ నుంచి కలెక్టర్​ టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. నీటి ఎద్దడి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న హ్యాండ్​ బోర్స్​, బోర్​ వెల్స్, మిషన్​ భగీరథ ద్వారా నీళ్లు అందించేలా ప్లాన్​ చేయాలని సూచించారు.

అవసరమైన ప్రాంతాలకు మిషన్​ భగీరథ నీటిని బల్క్​ సప్లై చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్​డీఎఫ్​లో ప్రతిపాదించిన పనుల పురోగతిపై నివేధికలను అందజేయాలని సూచించారు. ఈ టెలీకాన్ఫరెన్స్​లో అడిషనల్​ కలెక్టర్​ విద్యా చందన, మిషన్​ భగీరథ ఈఈ తిరుమలేశ్​ పాల్గొన్నారు.