భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఈనెల 16 నుంచి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఓటరుకూ పోలింగ్ స్లిప్పులు అందించాలన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్‌ను నియమించామన్నారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, మంగీలాల్, కార్తీక్ పాల్గొన్నారు.
రిటర్నింగ్ అధికారులు అలర్ట్‌గా ఉండాలి
నామినేషన్ల విత్‌డ్రాకు బుధవారం చివరి తేదీ కావడంతో రిటర్నింగ్ అధికారులు అలర్ట్‌గా ఉండాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ దాఖలు చేసిన క్యాండెట్ల నుంచి డిక్లరేషన్ ఫారం తీసుకొని తెలుగు అక్షరమాల ప్రాతిపదికన బ్యాలెట్ పేపర్ లిస్ట్ తయారు చేస్తూ ఇండిపెండెంట్ క్యాండెట్లకు గుర్తులను కేటాయించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలు అందజేయాలన్నారు.