పట్టభద్రులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి : కలెక్టర్​ ప్రియాంక అల

  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  పట్టభద్రులంతా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని కలెక్టర్​ ప్రియాంక అల సూచించారు. గురువారం కలెక్టరేట్​లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు, దరఖాస్తుల స్వీకరణలో తీసుకునే టైంలో ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు.

ఓటరు నమోదుపై గవర్నమెంట్​, ప్రైవేట్​ ఆఫీస్​లలో అవగాహన ప్రోగ్రాంలు నిర్వహించాలని చెప్పారు. అర్హులైన పట్టభద్రులు ఫారం –18లో వచ్చే నెల 6వ తేదీలోగా తమ ఓటును దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్టు తెలిపారు. మార్చి 14 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ రాంబాబు, డీఆర్​ఓ రవీంద్రనాథ్​ పాల్గొన్నారు.