- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అటవీ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులకు అధికారులు ఆటంకం కలిగించొద్దని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల సూచించారు. కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. మంజూరు చేసిన పనులు చేపట్టే ముందు ఫారెస్ట్ ఆఫీసర్లతో పాటు ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించాలన్నారు. శాఖల మధ్య సమన్వయం వల్లే డెవలప్మెంట్ వర్క్స్ స్పీడ్‌గా అవుతాయని చెప్పారు. పీసీసీఎఫ్ వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను తనకు నివేధికల రూపంలో అందజేయాలన్నారు.
ప్రజా అవసరాల కోసం చేపట్టిన పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో గిరి వికాసం కింద మంజూరైన బోరు బావులకు కరెంట్ సౌకర్యం కల్పించే పనులపై విద్యుత్ శాఖాధికారులు దృష్టి సారించాలన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన మండలాల్లో ల్యాండ్ ఎలాట్మెంట్ చేయాలని చెప్పారు. ఆయాన గ్రామపంచాయతీల్లో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ ఆఫీసర్లను ఆదేశించారు. మారుమూల గ్రామాల్లో సెల్ ఫోన్సేవలందేలా సంబంధిత డిపార్ట్మెంట్ఆఫీసర్లు చర్యలు చేపట్టాలన్నారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ డెవలప్మెంట్ వర్క్స్, సంక్షేమ పథకాల కోసం అవసరమైన ఫారెస్ట్ ల్యాండ్స్ పర్మిషన్ కోసం ఐటీడీఏకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు తప్పనిసరిగా జిల్లా స్థాయి కమిటీలో ఆమోదించాల్సి ఉంటుందన్నారు. పోడు పట్టాలున్న గిరిజన రైతులు ఆయిల్‌పామ్ సాగు కోసం బోరు బావులు, కరెంట్ సౌకర్యం కోసం ఆఫీసర్లు చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కిష్టాగౌడ్, అడిషనల్ కలెక్టర్లు పి. రాంబాబు, మధుసూదనరాజు, ఆర్ అండ్‌బీ ఈఈ బీమ్లా, జిల్లా అగ్రికల్చర్ అభిమన్యుడు, డీపీఓ రమాకాంత్ పాల్గొన్నారు.