వడ్ల కొనుగోలు స్పీడప్ చేయండి : ప్రియాంక అల

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: కొనుగోలు సెంటర్ల కు వచ్చే రైతులను ఇబ్బందులు పెట్టొద్దని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల ఆఫీసర్ల ను ఆదేశించారు. గురువారం మండలంలోని గుంపెన, రాజాపురం గ్రామాల్లో  ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. కొనుగోలు స్పీడప్ చేయాలన్నారు. ధాన్యం లో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. రాజాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి మిషన్ భగీరధ నీళ్ల సరఫరాను పరిశీలించారు.  

కార్యక్రమంలో తహసీల్దారు జగదీశ్వర ప్రసాద్, ఎంపీడీఓ మహాలక్ష్మి, సొసైటీ చైర్మన్ సుధాకర్ రావు, సీఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.