నెల రోజుల్లో 108 ఇండ్లు రెడీ చేయాలి: ప్రియాంక అలా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్​రూం ఇండ్లలో 108 ఇండ్లను వచ్చే నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె టౌన్​లో నిర్మిస్తున్న 828 ఇండ్లను పరిశీలించారు. మురుగు నీరు వెళ్లేలా సైడ్​కాల్వలు నిర్మించాలన్నారు. కరెంట్, డ్రింకింగ్​వాటర్, స్ట్రీట్​లైట్​ సదుపాయాలు కల్పించాలన్నారు. కలెక్టర్​వెంట పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్డీఓశిరీష, తహసీల్దార్​ పుల్లయ్య ఉన్నారు. 

అంతకు ముందు కలెక్టర్​మున్సిపల్​కమిషనర్లు, ఇంజనీర్లు, స్పెషల్​ఆఫీసర్లతో కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. పనులు త్వరగా పూర్తిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు లేట్​అయితే ఊరుకోబోనని హెచ్చరించారు. పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీల్లో యానిమల్ బర్త్​ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రతి మున్సిపాలిటీలో రెండు వార్డులను మోడల్​గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు.