ఆదిలాబాద్, వెలుగు: ప్రజా పాలన’ అప్లికేషన్లు అందజేశాక, ఎవరైనా పథకాలు అందేలా చూస్తామంటూ డబ్బు డిమాండ్ చేస్తే నమ్మొద్దని ఆదిలాబాద్కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభయ హస్తం అప్లికేషన్లు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కొంత మంది ఫారాలు నింపేందుకు కూడా డబ్బులు అడుగుతారని, ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వమే హెల్ప్ డెస్క్ ద్వారా ఉచితంగా అప్లికేషన్ఫారాలు అందిస్తోందని, అక్కడే ఫిలప్చేయిస్తామని తెలిపారు. రేషన్ కార్డులు లేనివారు ఆందోళన చెందొద్దని, రేషన్ కార్డు లేదని, ఫారంలో రాస్తే సరిపోతుందని సూచించారు. మహారాష్ట్ర వాసులు దరఖాస్తు చేసుకుంటే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు.