- అధికారులను ఆదేశించిన కలెక్టర్లు
మెదక్‌టౌన్, వెలుగు: ప్రజావాణి వినతులపై నిర్లక్ష్యం చూపొద్దని వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్రాజ్అధికారులకు సూచించారు. సోమవారం మెదక్కలెక్టర్ఆఫీసులోఅడిషనల్కలెక్టర్వెంకటేశ్వర్లుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 212 అర్జీలు రాగా అందులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం10, ధరణి భూ సమస్యలు-63, పింఛన్లకు సంబంధించి -35, రైతు రుణమాఫీ-16, ఉపాధి కోసం 5, ఇతర సమస్యలు-83 వచ్చాయని తెలిపారు.
సంగారెడ్డి టౌన్: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రజల నుంచి 86 అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ 56, సర్వ్ ల్యాండ్ రికార్డు 2, డీఆర్డీవో 4, ఎంప్లాయ్మెంట్, వ్యవసాయ శాఖ 9, మిషన్ భగీరథ్1, పంచాయతీ రాజ్ 3, మున్సిపాలిటీ 6 , శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యశాఖ1, పోలీస్ శాఖ 3, యువజన సంక్షేమ శాఖ 1 ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట రూరల్: ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఆయన అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. భూ సంబంధిత, ఆసరా పింఛన్లు, తదితర సమస్యలతో మొత్తం 37 దరఖాస్తులు అందాయని తెలిపారు. అనంతరం పార్టీ ఆఫీస్ కు స్థలం కేటాయించాలని కోరుతూ బీఎస్పీ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి పట్టణంలో 500 గజాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. అలాగే హుస్నాబాద్ లోని అక్రమ కట్టడాల పై వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్, జిల్లా ఈసీ మెంబర్ మహేశ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, డీఆర్డీఏపీడీ జయదేవ్ ఆర్యా, ఎవో అబ్దుల్ రహమాన్
పాల్గొన్నారు.