ప్రతి వాహనం చెక్​ చేయాలి : రాహుల్ రాజ్

ప్రతి వాహనం చెక్​ చేయాలి : రాహుల్ రాజ్

పాపన్నపేట, వెలుగు: ఎన్నికల్లో డబ్బులు పంపిణీ జరగకుండా ఎస్ఎస్ టీ టీమ్స్ప్రత్యేక నిఘాపెట్టి, ప్రతీ వాహనాన్ని చెక్​ చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన పాపన్నపేట మండలం నార్సింగి దారిదేవుడి ఆలయం వద్ద  ఆర్డీవో రమాదేవితో కలిసి పోలీస్ చెక్​పోస్ట్​ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ టీ టీం సభ్యులకు కలెక్టర్  పలు సూచనలు చేశారు. రికార్డులను పరిశీలించారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు 24 గంటలు  పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ప్రత్యేక నిఘా కోసం ఏర్పాటు చేసిన టీంలు మెరుగైన పనితీరును చూపాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్​లక్ష్మణ్ ​బాబు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు

మెదక్ టౌన్ :  మెదక్ పట్టణంలోని బాయ్స్​జడ్పీహెచ్ఎస్​ స్కూల్​పరీక్షా కేంద్రాన్ని ఆర్డీవో రమాదేవితో కలిసి కలెక్టర్ రాహుల్​రాజ్​తనిఖీ చేశారు. పరీక్షలు కొనసాగుతున్న తీరును పరిశీలించారు. స్టూడెంట్స్​కు కల్పించిన సౌకర్యాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్​ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించవద్దని సూచించారు.