సమగ్ర సర్వేలో ప్రతి ఇంటిని నమోదు చేయాలి : రాహుల్ ​రాజ్​

సమగ్ర సర్వేలో ప్రతి ఇంటిని నమోదు చేయాలి : రాహుల్ ​రాజ్​
  • కలెక్టర్​ రాహుల్ ​రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు:  సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఇంటిని నమోదు చేయాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులకు సూచించారు. శుక్రవారం స్వయంగా తన గృహ సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు అందించి ఇంటికి స్టిక్కర్​వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలో భాగంగా మూడో రోజు గృహాల జాబితా నమోదు చేస్తున్నామన్నారు. శనివారం నుంచి సమాచారం సేకరిస్తామని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1, 23,326 ఇళ్ల జాబి నమోదు చేయగా పట్టణ ప్రాంతంలో-19,754 , జిల్లా వ్యాప్తంగా 1, 43, 80 ఇళ్ల జాబితా నమోదైందని కలెక్టర్ ​తెలిపారు.