
మెదక్టౌన్, వెలుగు: జిల్లాలో వందశాతం ఓటింగ్ లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన మెదక్ కలెక్టరేట్లో ఓటరు చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటింగ్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కళాకారులు ఆటపాటలతో ప్రజలకు చైతన్యం కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు, డీపీవో యాదయ్య, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, డీఎస్వో రాజిరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్హరిదీప్సింగ్, కళాకారులు పాల్గొన్నారు.