యువత డ్రగ్స్​కి బానిస కావొద్దు :కలెక్టర్ ​రాహుల్​రాజ్​,

యువత డ్రగ్స్​కి బానిస కావొద్దు :కలెక్టర్ ​రాహుల్​రాజ్​,
  • ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి

మెదక్​ టౌన్, వెలుగు: యువత డ్రగ్స్​కు బానిసకావొద్దని కలెక్టర్​రాహుల్​రాజ్​ సూచించారు. శనివారం ఆయన మెదక్​ కలెక్టరేట్​లో నిర్వహించిన నార్కోటిక్‌‌  కో--ఆర్డినేషన్‌‌ సమావేశంలో ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్​మాట్లాడుతూ.. డ్రగ్స్‌‌ నిర్మూలనకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్‌‌ కమిటీలు ఏర్పాటు చేసి మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి స్టూడెంట్స్​కు వివరించాలన్నారు.

డ్రగ్‌‌ ఇన్‌‌స్పెక్టర్లు తమ ఏరియాల్లో గల వివిధ ఫార్మా కంపెనీలపై నిఘాపెట్టి, ప్రతి నెలా తనిఖీలు చేయాలని ఆదేశించారు. రైతులు ఎవరైనా గంజాయి సాగు చేసినా, అంతరపంటగా వేసినా వారి భూమిని జప్తు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్​నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు.

ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేశామని, 99 కేజీల గంజాయి, మత్తు పదార్థాలను సీజ్ చేసినట్లు చెప్పారు. వీటి విలువ రూ.19 లక్షలు ఉంటుందన్నారు. సమావేశంలో డీఆర్​వో భుజంగరావు, యాంటీ డ్రగ్ డీఎస్పీ పుష్పన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఏవో విన్సెంట్​వినయ్ కుమార్, డీవో మాధవి, డీడబ్ల్యూవో హైమావతి, ఆబ్కారీ సీఐ రాజేశ్, అధికారులు హరీశ్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​రాహుల్​రాజ్, ఎస్పీ ఉదయ్​ కుమార్​రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్​లో రోడ్డు ప్రమాదాల నివారణపై సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోఉన్న జాతీయ రహదారులు ఎన్​హెచ్​-44, 765డీలలో బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

 జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. తన కార్యాలయంలో జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్​ కమిషనర్లతో గూగుల్ మీట్​నిర్వహించారు. ఎంపీడీవో, మున్సిపల్​ఆఫీసులలోని ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా, ఆన్​లైన్​ఫారాలు డౌన్​లోడ్​ చేసుకొని వివరాలు నింపిన తర్వాత వాటిని ప్రజాపాలన కేంద్రాల్లో ఇచ్చి తమ వివరాలను నమోదు  చేసుకోవచ్చని సూచించారు. 

 మార్చిలోపు ఆస్పత్రి బిల్డింగ్​ పూర్తి చేయాలి  

కౌడిపల్లి:మార్చిలోపు కౌడిపల్లి కమ్యూనిటీ హెల్త్​సెంటర్​ బిల్డింగ్ పనులు పూర్తి చేయాలని లేదంటే కాంట్రాక్టర్​ను బ్లాక్​లిస్టులో పెడతామని కలెక్టర్​రాహుల్​రాజ్​హెచ్చరించారు.  ఆస్పత్రి నిర్మాణ పనులు నాణ్యతగా  ఉండాలని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చర్యలు తప్పవన్నారు. కౌడిపల్లి ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, మెడిసిన్​స్టోర్, గదులను  పరిశీలించారు. రోగులతో మాట్లడి వైద్య సేవల గురించి ఆరా తీశారు.

జిల్లాలోని అన్ని పీహెచ్ సీ, సీహెచ్ సీ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కలెక్టరేట్​, డీఎంహెచ్ వో ఆఫీస్ ల నుంచి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న మురికిని చూసి జీపీ సిబ్బంది పనిచేస్తున్నారా  లేదా అని ప్రశ్నించారు. కలెక్టర్​వెంట డాక్టర్లు శ్రీకాంత్, ఫర్నాజ్, మహిమ, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.