
తూప్రాన్, మనోహరాబాద్, వెలుగు: భూభారతితో రైతులకు న్యాయం చేయడమే ప్రధాన ధ్యేయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణిలో సరైన ఆప్షన్లు లేకపోవడంతో సమస్యలు పరిష్కరించేందుకు ఇబ్బందులు తలెత్తాయని ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతితో ఆ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం దొరికిందన్నారు. గతంలో సమస్యలు సరి చేసేందుకు అవకాశం లేక బాధితులను అధికారులమైన తామే కోర్టుకు వెళ్లాలని సూచించామని భూభారతితో ఆ పరిస్థితి ఉండదన్నారు.
న్ 2 నుంచి అన్ని జిల్లాల్లో భూభారతి చట్టం అమల్లోకి వస్తుందన్నారు. మ్యూటేషన్చేసేందుకు 30 రోజుల లోపు నోటీసులు ఇస్తామని దాని ఆధారంగా అన్ని పరిశీలించి చేస్తామన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 31న అన్ని గ్రామాల్లోని భూముల వివరాలను గ్రామపంచాయతీ నోటీసు బోర్డులో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం రైతుల నుంచి పలు అభిప్రాయాలను సేకరించారు. అనంతరం కూచారంలోని కేజీబీవీ స్కూల్‌ను తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, తహసీల్దార్విజయలక్ష్మి, ఎంపీడీవో శేషాద్రి, ఏవో గంగుమల్లు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు