
- నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్
నర్సాపూర్, వెలుగు: రాత్రిపూట డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్‌రాహుల్‌రాజ్ సూచించారు. శుక్రవారం రాత్రి నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి, కౌడిపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియా ఆస్పత్రిలోని ఇన్ పేషంట్ వార్డ్, మందుల గదిని పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను చెక్‌చేసి, రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు.
2 గంటల సమయంలో ఆవంచ గ్రామానికి చెందిన మహిళా పురిటి నొప్పులతో రాగా ఆస్పత్రి సిబ్బంది ఆమెకు కాన్పు చేశారు. శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో కౌడిపల్లి పీహెచ్ సీని తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడం చూసి హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.