మెదక్​లో డ్రగ్స్​స్టోర్, ఏరియా ఆస్పత్రి తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్​రాజ్​

మెదక్​లో డ్రగ్స్​స్టోర్, ఏరియా ఆస్పత్రి తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​లో పట్టణంలోని డ్రగ్ స్టోర్, ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ రాహుల్​రాజ్​శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్​స్టోర్​లో మందుల స్టాక్ రిజిస్టర్​ను పరిశీలించారు. అనంతరం మెదక్ ఏరియా ఆస్పత్రిలో టీకాల నిల్వ గదిని తనిఖీ చేశారు. అక్కడే కంటి పరీక్ష చేయించుకున్నారు. ఫిజియోథెరపీ సెంటర్ సేవల గురించి జిల్లా వైద్య అధికారి శ్రీరామ్​ను అడిగి తెలుసుకున్నారు.

డెంటల్ విభాగాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. డ్రగ్ స్టోర్ ద్వారా జిల్లాలో ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలకు సకాలంలో మందుల సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్​సీలలో వంద శాతం ఇమ్యునైజేషన్ సేవలందించాలన్నారు. కలెక్టర్​వెంట డీసీహెచ్​వో శివదయాల్, డాక్టర్​శివరామ్​, ఇమ్యూనైజేషన్​అధికారిని మాధురి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్ మల్కాజి, సంబంధిత వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఏఐ అమలుకు వసతులు కల్పిస్తాం

ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ కింద జిల్లాలో ఎంపికైన స్కూల్స్​లో అవసరమైన వసతులు కల్పిస్తామని కలెక్టర్​రాహుల్​రాజ్​ చెప్పారు. ఈ కార్యక్రమం కింద తూప్రాన్ , మనోరాబాద్ మండలం కాళ్లకల్, నర్సాపూర్ నెంబర్- -2, హవేళీ ఘనపూర్​ మండలంలోని బూర్గుపల్లి, నిజాంపేట, మాసాయిపేట ప్రైమరీ స్కూల్స్​ఎంపికయ్యాయన్నారు. ఈ స్కూల్స్​లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తామని కలెక్టర్​తెలిపారు.