రెడ్డిపల్లి కేజీబీవీలో ​తనిఖీలు చేసిన కలెక్టర్

రెడ్డిపల్లి కేజీబీవీలో ​తనిఖీలు చేసిన కలెక్టర్

మెదక్, వెలుగు: క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ ​రాహుల్​రాజ్​ బుధవారం చేగుంట మండలం రెడ్డిపల్లిలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కూరగాయల నాణ్యత, పప్పు దినుసులు, ఆహారపదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కాలం చెల్లిన సరుకులు వాడవద్దని వీటివల్ల ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. వండిన తర్వాత ఆహార పదార్థాలను టేస్ట్​ చేసిన తర్వాత స్టూడెంట్స్​కు వడ్డించాలన్నారు. 

జిల్లాలోని సంక్షేమ, రెసిడెన్షియల్, స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్ల పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో అడిషనల్​కలెక్టర్, డివిజనల్ స్థాయిలో ఆర్డీవో, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ నారాయణ, కేజీబీవీస్పెషల్​ఆఫీసర్​శ్రీవాణి ఉన్నారు.