
మెదక్టౌన్, వెలుగు: రాజీవ్ యువ వికాసం పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని మీ-సేవాసెంటర్లో రాజీవ్ యువ వికాసం ఆన్లైన్నమోదు విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలన్నారు.
ఇప్పటి వరకు హవేలీ ఘనపూర్ మండలంలో 68 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా డీఆర్డీవో పీడీ ఉంటారన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఆ ప్రింట్ ను ఎంపీడీవో, మున్సిపల్ పరిధిలో అందజాయాలని సూచించారు. కలెక్టర్ వెంట మీసేవ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు.