
- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్రాహుల్రాజ్తెలిపారు. శుక్రవారం మెదక్కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 30 సెంటర్లలో 6,238 మంది స్టూడెంట్స్పరీక్ష రాయనున్నారని తెలిపారు. ప్రతి సెంటర్ కు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. కాంపౌండ్ లేని పరీక్ష కేంద్రాలకు బారికేడ్లను అడ్డుగా పెట్టాలన్నారు.
విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని సూచించారు. స్టూడెంట్స్ఇబ్బంది పడకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్అధికారి మాధవి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ సహజం
ప్రతి ఉద్యోగికి విరమణ సహజమని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. శుక్రవారం మెదక్డీపీఆర్వో ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న కిషోర్ బాబు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన ఆఫీసులో కిషోర్ బాబును శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డీపీఆర్వో రామచంద్రరాజు, కిషోర్ బాబు కుటుంబ సభ్యులు, ఏపీఆర్ వో బాబూరావు, ప్రసాద్ పాల్గొన్నారు.