రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : ​రాహుల్​ రాజ్​

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : ​రాహుల్​ రాజ్​
  • కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

రేగొడ్, వెలుగు: రేషన్​కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్​రాహుల్​రాజ్​ అన్నారు. గురువారం ఆయన మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అర్హుల పేర్లు లబ్ధిదారుల లిస్టులో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనుల హాజరు ఉండాలన్నారు. సంక్షేమ పథకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. 

మర్పల్లి ప్రైమరీ స్కూల్​లో చిన్నారులతో ముచ్చటించి వారికి ప్రశ్నలు వేసి సామర్థ్యాలను పరీక్షించారు. ఈజీఎస్ పరిధిలో ఉన్న టాయిలెట్ పనులు పూర్తి కాలేదని వాటిని పూర్తి చేయించాలని టీచర్​సుప్రియ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్​ నరేశ్, ఎంపీడీవో సీతారామమ్మ, పీసీసీ కిషన్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ దిగంబర్, సీనియర్ నాయకులు నరేందర్, కో -ఆప్షన్ మెంబర్​చోటుమియా, ఆర్ఐ ఫిరోజ్, అగ్రికల్చర్ ఆఫీసర్ జావిద్ పాల్గొన్నారు.

ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థల పరిశీలన

అల్లాదుర్గం: మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం కలెక్టర్​రాహుల్​రాజ్​స్థలపరిశీలన చేశారు. క్షేత్రస్థాయిలో అనుకూలంగా ఉండే స్థలాలను గుర్తించి చర్యలు చేపడతామన్నారు. అల్లాదుర్గం మండల కేంద్రంలో ఎస్టీవో ఆఫీస్,  ఫైర్ స్టేషన్, ఐసీడీఎస్, ఎంపీడీవో ఆఫీసులతో పాటు గురుకులం, ప్రభుత్వ ఐటీఐ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్​ మల్లయ్య, ఆర్ఐ సందీప్, సర్వేయర్ రాజు,  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు