- కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌టౌన్, నర్సాపూర్, వెలుగు: దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకే సంక్షేమ ఫలాలు వర్తింపజేస్తామని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్యపురికాలనీలో రేషన్‌కార్డు వెరిఫికేషన్, రెడ్డిపల్లి గ్రామంలో నాన్కల్టివేషన్ల్యాండ్సర్వే తీరును కలెక్టర్పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.
వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అర్హుల అకౌంట్లలో నగదు జమ చేస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గుర్తించిన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.