సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కలెక్టర్ ​భోజనం

సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కలెక్టర్ ​భోజనం

మెదక్,కొల్చారం, వెలుగు: సన్నబియ్యం పేదలకు వరమని కలెక్టర్​ రాహుల్​రాజ్​అన్నారు. సోమవారం ఆయన కొల్చారం మండలం రాంపూర్​లో సన్న బియ్యం లబ్ధిదారు దుర్గరాజు ఇంట్లో అధికారులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్​మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రవేశ పెట్టడం శుభపరిణామమన్నారు. రాంపూర్ లో విస్తృతంగా పర్యటించి సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో మాట్లాడి బియ్యం ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా దుర్గరాజు కుటుంబ సభ్యులు సన్న బియ్యం పథకం తమ కుటుంబానికి ఎంతోమేలు చేస్తుందని తెలిపారు. డీపీవో యాదయ్య, అధికారులు  పాల్గొన్నారు.