విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు : కలెక్టర్​ రాహుల్​ రాజ్​

పాపన్నపేట, వెలుగు: విద్యా  వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం పాపన్నపేట మండలం చిన్న కోడూరు హై స్కూల్, షెడ్యూల్​ కులాల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. స్టూడెంట్స్​భోజన శాల, స్టోర్ రూంను పరిశీలించారు. మెనూ అమలు తీరు గురించి హెచ్​ఎంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీచర్ గా మారి స్టూడెంట్స్​కు పాఠాలు బోధించారు. స్టూడెంట్స్​ఉన్నత చదువులు చదివి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు.  

గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు ఆహ్వానం

మెదక్​టౌన్: గిరిజన సంక్షేమ గురుకుల స్కూళ్లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్​కలెక్టర్ ఆఫీసులో గిరిజన సంక్షేమ గురుకుల పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఫిబ్రవరి 1లోపు అప్లై చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ నగేశ్, రీజనల్ కో-ఆర్డినేటర్ గంగరామ్ నాయక్, జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రాయ్, కౌడిపల్లి స్కూల్​ప్రిన్సిపాల్ ఫణికుమార్, ఉదయ్ పాల్గొన్నారు.