
మెదక్టౌన్, వెలుగు: పదో తరగతి, ఇంటర్పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్4 వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 68 సెంటర్లలో మొత్తం 10,387 మంది స్టూడెంట్స్పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
ఇంటర్పరీక్షలకు 30 కేంద్రాలు ఏర్పాటు చేయగా 14,224 మంది స్టూడెంట్స్పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలన్నారు. అడిషనల్కలెక్టర్నగేశ్, డీఈవో రాధాకిషన్, డీఐవో మాధవి, ఆర్టీసీ డీఎం సురేఖ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.