కొల్చారం, వెలుగు: జిల్లాలోని సంక్షేమ స్కూళ్లు, హాస్టళ్లలో కొత్త మెనూ సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్‌రాహుల్‌రాజ్ ఆదేశించారు. గురువారం మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్, కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్పరిసరాలు, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్స్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ టీచర్లు విద్యాలయాలను శుభ్రంగా ఉంచుతూ ఉత్తమ విద్యా బోధన చేయాలన్నారు. మెనూ అమలుపరిచే విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో స్కూల్, కాలేజీ ప్రిన్సిపాల్, టీచర్లు పాల్గొన్నారు.
22న మెదక్‌లో గవర్నర్ పర్యటన
మెదక్ టౌన్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ నెల 22న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ చర్చిని సందర్చించడంతో పాటు కొల్చారంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్‌తో మాట్లాడుతారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య, సెక్రెటరీ శ్యాంసన్ సందీప్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రూట్ మ్యాప్, పార్కింగ్, చర్చి ఆవరణలో ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ చర్చి ఈ నెల 25తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో గవర్నర్ చర్చి సందర్శించనున్నట్టు తెలిపారు.
పదిలో ఉత్తీర్ణత పెరగాలి
పదో తరగతి ఉత్తీర్ణతలో మెదక్జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి స్టూడెంట్స్‌తో పాటు టీచర్లు, తల్లిదండ్రులు కృషి చేయాలని కలెక్టర్‌రాహుల్‌రాజ్ సూచించారు. గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరగాలన్నారు.
అనంతరం జిల్లాలోని ఆయా స్కూళ్లలో టీచర్లు చేపడుతున్న ప్రణాళికలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, ఎంఈవోలు, అధికారులు పాల్గొన్నారు.