మెదక్ జిల్లాలో ప్రజావాణి అర్జీలను పెండింగ్​లో పెట్టొద్దు : కలెక్టర్​ రాహుల్​ రాజ్

మెదక్ జిల్లాలో ప్రజావాణి అర్జీలను పెండింగ్​లో పెట్టొద్దు : కలెక్టర్​ రాహుల్​ రాజ్

మెదక్, వెలుగు: ప్రజావాణి అర్జీలను పెండింగ్​లో పెట్టొద్దని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్​ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఆర్ వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులతో  క‌లిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మొత్తం 61 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీటిలో 3 పింఛన్లు, 20 ధరణి సమస్యలు, 11 ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సమస్యలు 27 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండల స్థాయిలో తప్పకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 

సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రజల నుంచి 85 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ మాధురి, డీఆర్​వో పద్మజారాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు 
పాల్గొన్నారు.

సిద్దిపేట టౌన్: ప్రజావాణికి వచ్చిన సమస్యలను పరిష్కరించి రిపోర్ట్​ను కలెక్టర్​ఆఫీసులో అందించాలని అడిషనల్​ కలెక్టర్​అబ్దుల్​హమీద్​ అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 96 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్​స్కూల్స్​లో 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరుతూ  దళిత, గిరిజన వర్కింగ్ జర్నలిస్ట్ సంగం రాష్ట్ర కన్వీనర్ వనం రమేశ్ అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. 

2022-23 లో డైరీ ఫామ్​ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి తమకు శాంక్షన్ లెటర్ వచ్చిందని, కానీ ఇప్పటివరకు సబ్సిడీ అమౌంట్, బర్లు రాలేదని దుబ్బాక మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన దళిత కుటుంబాల సభ్యులు అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ కు విన్నవించారు. కార్యక్రమంలో డీఆర్​వో నాగరాజమ్మ, ఏవో అబ్దుల్ రహమాన్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.