నేరడిగొండ , వెలుగు : జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సన్మానించారు . ఇటీవల బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగిన 41 వ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ జట్టు మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది . ఈ జట్టులో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కేజీబీవీ స్కూల్‌కి చెందిన విద్యార్థులు శిరీష , అలేఖ్య , వనిత ఉన్నారు .
ఈ విద్యార్థులను కలెక్టర్ రాహుల్ రాజ్ , బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , డీఈఓ ప్రణీత , తదితరులు అభినందించారు. స్పెషల్ ఆఫీసర్ రజిత , పీఈటీ స్నేహ ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు విద్యార్థినులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతిరామ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గస్కంటి గంగాధర్ , కేజీబీవీ ఎస్ ఓ రజిత తదితరులు పాల్గొన్నారు .